వంటగది బిల్లులు చెల్లించాలి: ప్రజావాణిలో ఫిర్యాదు

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో మన ఊరు–మన బడి కార్యక్రమంలో వంటగది నిర్మాణం చేపట్టారు. గ్రామానికి చెందిన గిన్నారపు కుమారస్వామి కాంట్రాక్టు తీసుకుని నిర్మాణం పూర్తి చేశారు. కానీ సంవత్సరాలైనా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆయన మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.



