ఫేక్ న్యూస్ పోస్టులపై జర్నలిస్ట్ అరెస్ట్

AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రజల్లో భయాందోళన కలిగించేలా సోషల్ మీడియాలో అవాస్తవ పోస్టులు పెట్టిన ఓ దినపత్రిక విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి మూకలు ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారంటూ ఆయన ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆడియో రికార్డుల ఆధారంగా విచారణ జరిపి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసరావు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.



