మహబూబాబాద్‌లో చిరుత సంచారం కలకలం

మహబూబాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈదులపూసపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పాదముద్రలను రైతులు గుర్తించారు. తిరుమలేష్ అనే రైతు పశువులను మేతకు అడవికి తీసుకెళ్లగా లేగదూడ, కనిపించకపోవడంతో వెతికినా ఆచూకీ లభించలేదు. చిరుత దాడిలోనే దూడ మృతి చెంది ఉండొచ్చని రైతు అనుమానం వ్యక్తం చేశాడు. FRO సురేష్ ఆధ్వర్యంలో అధికారులు పాదముద్రల అచ్చులు సేకరించారు. రైతులు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.



