అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే మంత్రి, MLA నారా లోకేష్ లక్ష్యమని టీడీపీ నాయకులు తెలిపారు. తాడేపల్లి నవోదయ కాలనీలో ₹.9 లక్షలతో పార్కు అభివృద్ధి, మహానాడు 13వ రోడ్డులో ₹.2.90 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. నియోజకవర్గంలో తాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, గ్యాస్ పైప్లైన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.


