← Back to news

ప్రయివేటు పెద్ద దవాఖానాల్లో పేదలకు అన్యాయం..!

By Digamber· 1d ago· Boregaon, Mudhole, Nirmal
ప్రయివేటు పెద్ద దవాఖానాల్లో  పేదలకు  అన్యాయం..!

నిర్మల్ జిల్లాలో కొన్ని ప్రైవేటు దవాఖానాలు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ బోర్డులు తగిలించుకుని పేదల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు భక్తుల రంజిత్ ఆరోపించారు. ఈ విషయమై ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్స్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని నమ్మించి, అవి లేకున్నా అనవసర టెస్టులకు డబ్బులు గుంజుతున్నారని తెలిపారు. స్పెషల్ డాక్టర్లు లేకున్నా ఉన్నారని చెప్పి మోసం చేస్తున్నారన్నారు. అధికారులు ఇటువంటి దవాఖానాలను తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రయివేటు పెద్ద దవాఖానాల్లో  పేదలకు  అన్యాయం..!
ప్రయివేటు పెద్ద దవాఖానాల్లో  పేదలకు  అన్యాయం..!

More in Local