← Back to news

ఉద్యమమే ఊపిరిగా జీవించిన కొండా లక్ష్మణ్

By A.Ajay· 1d ago
ఉద్యమమే ఊపిరిగా జీవించిన కొండా లక్ష్మణ్

TG: తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఇవాళ. 1915లో వాంకిడిలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలోకి వచ్చారు. 1952లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచి, తన నివాసం(జలదృశ్యం)ను ఉద్యమానికి వేదికగా ఇచ్చారు. పదవులకంటే ఉద్యమాన్నే ముఖ్యంగా భావించిన నాయకుడిగా బాపూజీ గుర్తుండిపోతారు.

More in TG