← Back to news

2 వేలకుపైగా కోళ్లు మృతి.. కారణం ఏంటి ?

By Lokesh· 5 Oct 2026

AP: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలోని ఓ కోళ్ల ఫామ్‌లో 2 వేలకుపైగా నాటు కోళ్లు చనిపోయాయి. దీంతో కోళ్ల శాంపిల్స్ లను టెస్టులకి పంపగా.. భోపాల్‌లోని ప్రయోగశాలలో H5 బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు ఫామ్ చుట్టూ జాగ్రత్త చర్యలు చేపట్టారు. అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్, గుడ్లను పూర్తిగా ఉడికించి తినాలని, అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.

More in AP