← Back to news

న్యూస్ పేపర్‌తో వినాయకుడు

By DK· 4h ago
న్యూస్ పేపర్‌తో వినాయకుడు

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్‌ఈ పాఠశాల విద్యార్థులు న్యూస్ పేపర్‌తో పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని రూపొందించారు. గత కొన్ని రోజులుగా అవసరమైన వస్తువులను సమకూర్చుకున్న విద్యార్థులు రెండు రోజుల్లో విగ్రహాన్ని తయారు చేశారు. పాఠశాలలో గత మూడేళ్లుగా పర్యావరణహిత గణనాథులను తయారు చేస్తున్నారు. మొదటి ఏడాది గడ్డితో, రెండో ఏడాది టేకు చెట్టు ఆకులతో, మూడో ఏడాది న్యూస్ పేపర్‌తో విగ్రహాలను రూపొందించారు.

More in Local