← Back to news

24 గంటల విద్యుత్ ఎక్కడ? రైతు ఆవేదన

By Anusha· 9 Oct 2026

TG: తెలంగాణలోని మెదక్ జిల్లా గవ్వలపల్లి గ్రామంలో కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ ఓ రైతు విద్యుత్ శాఖ అధికారులైన ADE, AE కాళ్లపై పడి వేడుకున్నాడు. దీనికి సంబంధించిన 12 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతుండగా, గ్రామాల్లో పరిస్థితి మరోలా ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు.

More in TG