బాలయ్యను పరామర్శించిన CM చంద్రబాబు!

సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్‌లో కోలుకుంటున్న ఆయనను AP CM చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలయ్య హెల్త్ కండిషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIG హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా వారి వెంటే ఉన్నారు. బాలకృష్ణ త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది.



