అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో లాయర్లపై దాడి?
TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో లాయర్లపై దాడి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. తన క్లయింట్‌కు స్టేషన్ బెయిల్ కోసం వెళ్లిన సమయంలో ASI, కానిస్టేబుల్, తనతో పాటు మరో మహిళా లాయర్‌పై దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని ఓ న్యాయవాది సోషల్ మీడియాలో చెప్పారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆరోపణలపై పోలీసుల నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.


