← Back to news

వెల్గటూర్‌లో SGF క్రీడా పోటీలు

By Srikanth Goud· 1d ago· Jagitial
వెల్గటూర్‌లో SGF క్రీడా పోటీలు

TG: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో క్రీడా పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 10, 11, 15 తేదీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి బి. ప్రభాకర్, మండల కన్వీనర్‌ పి. రాజ్‌కుమార్‌ తెలిపారు. 10న అండర్‌-14, అండర్‌-17 బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్‌ పోటీలు, 11న బాలురకు ఇదే క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. 15న బాల, బాలికలకు అథ్లెటిక్స్‌ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో మండల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.