భైరవపాలెంలో మత్స్యకారుల బోటుకు ప్రమాదం
కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. భైరవపాలెం మొగ వద్ద తెల్లవారుజామున బలమైన గాలులు వీయడంతో చింత శ్రీనుకు చెందిన బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. బోటులో వేటకు వెళ్లిన భైరవపాలెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మరో బోటు సిబ్బంది స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.



