కారును తప్పించబోయి లారీ బోల్తా
వరంగల్‌లోని పాత బీట్ బజార్ బ్రిడ్జి ప్రారంభ కూడలిలో అర్ధరాత్రి లారీ బోల్తా పడింది. వరంగల్ నుంచి ఖమ్మం, తొర్రూరు వైపు వెళ్తున్న లారీ కట్టెల లోడ్‌తో బ్రిడ్జి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కూడలిలో గుర్తుతెలియని కారు సడెన్‌గా అడ్డు రావడంతో దాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించగా వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో ప్రాణనష్టం తప్పింది. సిగ్నల్ వ్యవస్థ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.



