శ్రీసిటీ బ్లాస్ట్‌లో.. పెరిగిన మృతుల సంఖ్య
AP: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం <a href="https://www.theclearcutnews.com/n/UESRxR6">శ్రీసిటీలోని Till Healthcare </a>ఇండస్ట్రిలో బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు కార్మికులు మృతి చెందారు. ఇద్దరు స్పాట్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరు తడ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. చనిపోయారు. ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, వైద్యులు క్షతగాత్రుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

