← Back to news

'ఓటుపై ప్రజలకు నమ్మకం కల్పించాలి'

By GVM VITTAL· 1d ago· Kamareddy, Kamareddy, Kamareddy
'ఓటుపై ప్రజలకు నమ్మకం కల్పించాలి'

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య, ఓటు హక్కుల పరిరక్షణ కోరుతూ మహనీయుల విగ్రహాల ఎదుట నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా CEC జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల తొలగింపు, ఈవీఎంల వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని కోరారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని పేర్కొన్నారు.

More in Local