← Back to news

నల్లమలలో ఆదివాసీల నిరసన..

By Prashanth· 2h ago· Nagarkurnool

TG: నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లోని ITDA ఆఫీస్ ఎదుట తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ధర్నా చేశారు. ఆదివాసీల హక్కులు, వారి గూడాల్లోని సమస్యలు పరిష్కరించాలని, ITDAలో Group-1 స్థాయి అధికారిని నియమించాలని డిమాండ్‌ చేశారు. స్వామి వివేకానంద విగ్రహం నుంచి ITDA ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొని, సంప్రదాయ నృత్యాలతో నిరసన తెలిపారు.

More in TG