← Back to news

సీఎం చంద్రబాబుకు దసరా ఉత్సవాల ఆహ్వానం

By epuri rajaratnam· 20h ago· Guntur (R), Guntur West, Guntur
సీఎం చంద్రబాబుకు దసరా ఉత్సవాల ఆహ్వానం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా మహోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనకు ఆహ్వానపత్రిక అందించారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి ప్రసాదం అందించి, వేదాశీర్వచనం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సీఎం చంద్రబాబుకు దసరా ఉత్సవాల ఆహ్వానం

More in Local