ఆదివాసీల అద్భుతం..వెదురు కొమ్ములు కూర!

ఆదివాసీల జీవన విధానంలో అడవి అంటే కేవలం చెట్లు, కొండలు మాత్రమే కాదు. వారి ఆహారం, ఆరోగ్యం, సంస్కృతి, జీవనాధారం కూడా. వర్షాకాలం ప్రారంభమైతే అడవుల్లో ప్రకృతి అందాలతోపాటు అనేక రకాల సహజ ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కోరేడిగా పిలిచే వెదురు కొమ్ములు వర్షాకాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. అడవిలోకి వెళ్లే ఆదివాసీ ప్రజలు తాజా వెదురు కొమ్ములను సేకరించి ఇళ్లకు తీసుకువస్తారు. అనంతరం తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయ పద్ధతుల్లో వాటిని శుభ్రం చేసి వంట చేసుకుంటారు.



