← Back to news

YCP నేత హత్య కేసులో కీలకం.. నిందితుడు కోర్టులో లొంగిపోయాడు!

By SUBHANI· 11h ago
YCP నేత హత్య కేసులో కీలకం.. నిందితుడు కోర్టులో లొంగిపోయాడు!

ఆగస్టు 2026లో పల్నాడు జిల్లా రెంటాల గ్రామంలో YCP నేత చెన్నారెడ్డి హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడు ఉమామహేశ్వరరెడ్డి. ఆయన గురువారం గురజాల కోర్టులో లొంగిపోయారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. పోలీసులు కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించారు. కస్టడీ కోరికపై విచారణ కొనసాగుతోంది. హత్యకు కారణం ఇంకా తెలియరాలేదు. చెన్నారెడ్డి బైకుపై వెళ్తుండగా కారుతో ఢీ కొట్టి, కళ్లలో కారం చల్లి, గొంతుకోసి హతమార్చిన సంఘటన అప్పట్లో ఎపి రాజకీయాల్లో కలకలం రేపింది.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.