విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి.. ఆయనేనా?

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. విజయవాడ మేయర్ స్థానం జనసేనకు, మచిలీపట్నం TDPకి కేటాయించారు. విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. వైసీపీ నుంచి రాయన భాగ్యలక్ష్మి పోటీ చేసే అవకాశం ఉంది. నగర పంచాయితీల్లో నందిగామ, జగ్గయ్యపేట, కొండపల్లి, ఉయ్యూరు, తాడిగడప, గుడివాడ TDPకి, తిరువూరు, పెడన జనసేనకు కేటాయించారు. ఈ జిల్లాలో BJPకి ఎలాంటి స్థానాలు కేటాయించలేదు.


