ప్రపంచ తెలుగు మహాసభల్లో 16 ఏళ్లలోపు వారికి అవకాశం

వచ్చే డిసెంబరు 5, 6 తేదీల్లో ఒంగోలులో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ‘పాడనా తెలుగు పాట’ కార్యక్రమం ప్లాన్ చేశారు. 16 ఏళ్లలోపు బాలబాలికలు ఇందులో పాల్గొనొచ్చు. కరోకే ద్వారా రెండు పాటలు రికార్డ్ చేసి సెప్టెంబరు 30లోగా srividyajv8@gmail.comకు పంపాలి. సెలెక్ట్ అయిన వారికి అక్టోబరు 15లోగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తెలుగు సాహిత్య, సంగీత విలువలున్న పాటలకే ఛాన్స్ ఉంటుంది. ఎంపికైన వారికి ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు ఇతర ఫెసిలిటీస్ అందిస్తారు.



