మేయర్ పదవి ఎస్సీలకు కేటాయించాలి: రమణ

శ్రీకాకుళం నగరంలో ఎస్సీలకు మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించే విషయంలో వాస్తవ జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ మాదిగ కోరారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎస్సీలకు ఈ పదవుల్లో అవకాశం దక్కలేదని ఆయన అన్నారు. 2011 జనాభా లెక్కలు, ప్రస్తుత వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వార్డుల వారీగా ఎస్సీ జనాభాను సక్రమంగా నిర్ధారించాలని కోరారు.



