← Back to news

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఎం

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఎం

SIR ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్‌లోని ప్రాతూరు జాతీయ రహదారి వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం తాడేపల్లి మండల సీనియర్ నాయకుడు జొన్న శివశంకరరావు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని విమర్శించారు.

More in Local