జనాలు లేరని షో క్యాన్సిల్.. ప్రేక్షకులకు షాక్
హైదరాబాద్లోని సంతోష్నగర్ యాదగిరి థియేటర్లో 6:35 షో చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. సాయంత్రం 6:30 గంటలైనా టికెట్లు ఇవ్వకపోవడంతో ఆరా తీయగా, షో క్యాన్సిల్ అయిందని చెప్పినట్లు ఓ ప్రేక్షకుడు తెలిపారు. జనాలు సరిపడా రాలేదని, బాల్కనీ టికెట్లు తీసుకుంటే షో వేస్తామని డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్లు ఆరోపించారు. ₹.50 టికెట్లు తీసుకునే ప్రేక్షకులను అవమానకరంగా దూషించారన్నారు. సమయం, డబ్బు ఖర్చు చేసి వచ్చినా సినిమా చూడకుండానే వెనుదిరిగామన్నారు.


