← Back to news

అల్లాపూర్‌లో డ్రైనేజీ సమస్య.. వెంటనే పరిష్కరించాలి

By mahesh anthati· 2d ago· Allahpur
అల్లాపూర్‌లో డ్రైనేజీ సమస్య.. వెంటనే పరిష్కరించాలి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం అల్లాపూర్ గ్రామంలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని DYFI జిల్లా కమిటీ సభ్యుడు అంతటి మహేశ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎస్సీ, దళిత వాడల్లో మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఇప్పటికే పలుమార్లు సర్పంచ్, గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.