AP మున్సిపల్ ఎలక్షన్స్లో.. NDA పార్టీల సీట్ల లెక్క ఇదే!

AP: ఏపీలో మున్సిపల్ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకం కుదిరింది. 17 కార్పొరేషన్లలో టీడీపీకి 11, జనసేనకు 4, బీజేపీకి 2 కేటాయించారు. 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో టీడీపీ 78, జనసేన 21, బీజేపీ 7 చోట్ల పోటీ చేయనున్నాయి. విజయవాడ, కాకినాడ, ఏలూరు కార్పొరేషన్లు జనసేనకు, రాజమహేంద్రవరం, అనంతపురం బీజేపీకి దక్కాయి. మిగతా కార్పొరేషన్లలో టీడీపీ పోటీ చేయనుంది. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.


