TDP vs YCP.. రచ్చ రచ్చ
APలో ఏం జరగకూడదని ప్రజలు కోరుకుంటున్నారో అదే హింస చెలరేగుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న TDP క్యాడర్ దాడులకు దిగుతోందనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి. అన్నమయ్య జిల్లా.. రాయచోటిలో TDP కేడర్.. YCP మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆఫీసుపై దాడి చేసి, దాదాపు 10 వాహనాల్ని తగలబెట్టింది. దాడి సమయంలో శ్రీకాంత్ రెడ్డి ఆఫీసు లోనే ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రజలు భయాందోళనలో ఉన్నారు.


