← Back to news

అవినీతిపై ప్రజలే ప్రశ్నించాలి: షేక్ అబ్దుల్ రజాక్

By SHAIK SUBHANI· 1d ago· Madugula, Madugula, Anakapalli
అవినీతిపై ప్రజలే ప్రశ్నించాలి: షేక్ అబ్దుల్ రజాక్

మార్కాపురంలో MPJ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన MPJ-ఏపీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడారు. అవినీతిపై ప్రజలు చైతన్యంతో ప్రశ్నించినప్పుడే దాన్ని సమర్థవంతంగా అరికట్టగలమని అన్నారు. కార్యక్రమంలో షేక్ ఖాశిం, షేక్ నాగూర్ మీరావలి, సయ్యద్ మస్తాన్ వలీ, షేక్ అబ్బాస్, షేక్ అమీర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

More in Local