దెయ్యాల బాధ తీరుస్తానని.. పూజారి లైంగికదాడి
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాకు చెందిన ఓ పూజారి మహిళపై అఘాయిత్యం చేశాడు. 2024 డిసెంబర్‌లో దెయ్యాన్ని వదిలిస్తానని చెప్పి ఓంకార్ మిశ్రా ఓ మహిళను తన ఆశ్రమానికి పిలిపించి లైంగికదాడి చేశాడు. ఆ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. సంవత్సరం తర్వాత బాధితురాలి కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసి ఓంకార్ మిశ్రాను అరెస్ట్ చేశారు. సాగర్ జిల్లా కోర్టు ఇటీవల అతన్ని దోషిగా తేల్చి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

