బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న స్పీకర్

రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ గణేశుడిని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్న స్పీకర్.. గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.



