← Back to news

పాముకాటు.. మార్గమధ్యంలోనే మహిళ మృతి

By chandrashekar· 1d ago· Tallada, Thallada, Khammam
పాముకాటు.. మార్గమధ్యంలోనే మహిళ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తెలగవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తేల్లూరి వాణి (30) మంగళవారం పత్తి ఏరేందుకు పొలానికి వెళ్లగా పాము కాటేసింది. వెంటనే ఆమెను కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వాణికి భర్త వెంకన్నతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, తోటి కూలీలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబసభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

More in Local