← Back to news

బైక్‌పై ఇంటింటికీ వెళ్లి చెక్కులిచ్చిన టీడీపీ నేత!

By gani· 1d ago· Gokavaram, Gokavaram, East Godavari
బైక్‌పై ఇంటింటికీ వెళ్లి చెక్కులిచ్చిన టీడీపీ నేత!

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో అనారోగ్యంతో చికిత్స పొందిన 45 మందికి రూ.38.46 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఆయన బైక్‌పై వెళ్లి ఇంటింటికీ చెక్కులు అందించి, లబ్ధిదారులకు భరోసా కల్పించారు. ఆపదలో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.