పంజాబ్ యువకులపై కెనడా స్ట్రిక్ట్ యాక్షన్.. అసలేం జరిగింది?

కెనడాలో ఎక్స్‌టార్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్‌తో సంబంధాలున్న నలుగురు పంజాబ్ యువకులను అధికారులు దేశం నుంచి బహిష్కరించారు. పాల్విందర్ సింగ్, జస్మేర్ సింగ్, అమితోజ్ బజ్వా, సాహిబ్‌జోత్ సింగ్‌లను కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (CBSA) గుర్తించింది. ఇప్పటివరకు ఎక్స్‌టార్షన్ కేసులతో సంబంధం ఉన్న 111 మందిని కెనడా నుంచి పంపించినట్లు తెలిపింది. రూల్స్‌కు విరుద్ధంగా ఉంటున్న వారిపై కెనడా చర్యలు తీసుకుంటోంది. గతేడాది 23,160 మందిని డిపోర్ట్ చేయగా.. వారిలో 1,010 మంది ఆర్గనైజ్డ్ నేరాలతో సంబంధం ఉన్నవారే అని తేలింది.



