ట్రంప్‌కి కోర్టు బిగ్ షాక్.. ఇండియన్స్‌కి రిలీఫ్!

ట్రంప్ గవర్నమెంట్ తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధనలకు బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల స్టే పీరియడ్‌పై లిమిట్స్ విధించేలా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ చేసిన ప్రతిపాదనల అమలును తాత్కాలికంగా అడ్డుకుంది. ఈ రూల్స్ అమలైతే యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ తగ్గి, ఎకానమీపై దెబ్బపడుతుందని కోర్టు చెప్పింది. ఈ ఆర్డర్‌తో దాదాపు 3 లక్షల మందికి పైగా ఇండియన్స్‌కు బిగ్ రిలీఫ్ లభించింది.



