← Back to news

జూలో ‘చైల్డ్ ప్రిడేటర్ టూర్’.. అసలు విషయం ఇదే!

By Lokesh· 22h ago· Bbc
జూలో ‘చైల్డ్ ప్రిడేటర్ టూర్’.. అసలు విషయం ఇదే!

UKలోని చెస్టర్ జూ వెబ్‌సైట్‌లో జంతువులను చూపించే టూర్‌కు పొరపాటున ‘Child Predator Tour’(బాలల్ని లైంగికంగా వేధించే వ్యక్తి టూర్) అనే పేరు కనిపించడంతో సందర్శకులు ఆశ్చర్యపోయారు. 90 నిమిషాల ఈ టూర్‌లో సుమత్రా పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, కొమోడో డ్రాగన్‌లను చూపించాల్సి ఉంది. తమ సిస్టమ్‌లోని డిఫాల్ట్ నేమింగ్ విధానం వల్ల ఈ పొరపాటు జరిగిందని జూ యాజమాన్యం తెలిపింది. విషయం గుర్తించిన వెంటనే పేరును మార్చినట్లు వెల్లడించింది. ఈ తప్పిదంపై నెటిజన్లు SMలో సెటైర్లు వేశారు.

More in International

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!
International· 27m ago

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!

అమెరికా రిపబ్లికన్ నేత బో ఫ్రెంచ్.. టెక్సాస్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇండియన్, దక్షిణాసియా స్టూడెంట్స్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వారిని ‘ఫారినర్స్’గా పేర్కొంటూ అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఆక్రమిస్తున్నారంటూ <a href="https://x.com/bofrench/status/2099142867025383497?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2099142867025383497%7Ctwgr%5Ec8711a43d9b2e368f69e96dcb84abc21f32eb28b%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.firstpost.com%2Fworld%2Fbo-french-splits-us-mid-term-elections-with-his-racist-remarks-targeting-indian-students-14046020.html">'X'లో</a> పోస్టు చేశారు. దీంతో ఆయనపై రేసిజం, జెనోఫోబియా ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతలు, సెనేటర్ జాన్ కార్నిన్ కూడా ఫ్రెంచ్ కామెంట్స్‌ను తప్పుబట్టారు. ఆయన మాత్రం తన కామెంట్స్‌పై వెనక్కి తగ్గకుండా సమర్థించుకున్నారు.