← Back to news

ఆర్టీసీ చౌరస్తాలో వ్యక్తి హల్‌చల్

By Bala· 15h ago

జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఓ వ్యక్తి మున్సిపల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ హోర్డింగ్‌పైకి ఎక్కి హంగామా చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. హోర్డింగ్‌పై ఉన్న వ్యక్తిని సురక్షితంగా కిందికి దించేందుకు క్రేన్‌ సాయంతో ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో చౌరస్తాలో కొంతసేపు ప్రజలు, వాహనదారుల్లో ఆందోళన కనిపించింది. వ్యక్తి హోర్డింగ్‌పైకి ఎక్కేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

More in Local