డప్పులతో CECపై నిరసన.. ‘రావణా’ అంటూ నినాదాలు
ముంబైలో CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా CJP, విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. డప్పులు వాయిస్తూ.. “సర్కార్‌లో కూర్చున్న రావణా.. నీ ముఖం నల్లబడాలి” అంటూ నినాదాలు చేస్తున్నారు. SIRలో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తూ, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. SIRను ఆపడంతో పాటు, ఎన్నికల సంఘం అధికారుల నియామకంలో పారదర్శకత ఉండాలని కోరుతున్నారు.