సీనియర్ జర్నలిస్ట్ కుటుంబానికి సత్యవతి రాథోడ్ పరామర్శ!

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచందర్ తండ్రి అనుగోజు కోటయ్య ఇటీవల మృతి చెందారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పూర్ణచందర్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, ఐలి నరహరి గౌడ్, బొడ శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ కె. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


