← Back to news

పోలింగ్‌ స్టేషన్ల జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశం

By yerraguntla sunil· 1h ago· Udayagiri, Sri Potti Sriramulu Nellore
పోలింగ్‌ స్టేషన్ల జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో టి.సుకుమార్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాలో ఏవైనా మార్పులు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 30,577 మంది ఓటర్లు ఉన్నారని ఎంపీడీవో తెలిపారు.

More in Local