← Back to news

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

By Sagar· 9h ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

పెద్దపల్లి జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కొనుగోళ్ల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి GPS ట్రాకర్ తప్పనిసరిగా ఉండాలని, ఓవర్‌లోడ్‌ను అనుమతించవద్దని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో హమాలీల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

More in Local