ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల పోరుబాట

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 11 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. 25వేల పోస్టులతో మెగా DSC, గురుకుల, మోడల్ స్కూల్, JL, DL తదితర నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల్లో పోస్టులు పెంచి 19 వేల CI, SI, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని, ఉద్యోగ దరఖాస్తులకు ఎలాంటి ఫీజు లేకుండా అవకాశం కల్పించాలని కోరారు.



