చింతకుంట కెనాల్‌లోకి ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలి

చింతకుంట కెనాల్‌లో వినాయక నిమజ్జనాలకు ఇబ్బందులు లేకుండా ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా చింతకుంట కెనాల్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఇక్కడ సుమారు 700–800 విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉందని తెలిపారు. చింతకుంట, కొత్తపల్లి, మానకొండూరు వద్ద నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేయాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో నీరు విడుదల చేస్తే ఏర్పాట్లు పూర్తి చేసుకోవచ్చన్నారు.



