బాలాజీ పాఠశాలలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం

వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరిగింది. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ ఏ. వనజా రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ దేశాల ప్రజలంతా శాంతిని కోరుతూ ఐక్యంగా ఉండాలని చైర్మన్ అన్నారు. ఘర్షణలకు ముగింపు పలికి శాంతియుత సమాజం ఏర్పాటు దిశగా ముందడుగు వేయడానికే శాంతి దినోత్సవం అని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.



