Terror Groupతో సంబంధం..బెంగాల్ యువకుడి అరెస్ట్

అఫ్గానిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న Terror Groupతో సంబంధం ఉన్న అసఫూల్ మాలిక్ అనే యువకుణ్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిది పశ్చిమబెంగాల్. అతను ఏడాదిగా బెంగళూరులోని జిగాని ప్రాంతంలోని ఓ టెక్ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(TTP) సభ్యుడితో కలిసి ఆ సంస్థలో చేరడానికి అతను ట్రై చేస్తున్నట్లు గుర్తించారు. అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలపై వివరాలు అందడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.



