GO-97లో మార్పులు.. హైలెవెల్ కమిటీ సజెషన్స్

TG: 35 రోజులుగా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ నిరసనలు కొనసాగుతున్న వేళ.. వివాదాస్పద GO-97లో మార్పులు చెయ్యాలని హైలెవెల్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. SBటెట్, టెక్నికల్ విద్యాశాఖలను స్కిల్స్ యూనివర్శిటీలో విలీనం చేయవద్దని ప్రతిపాదించింది. ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్స్‌ను పాత పద్దతి లోనే కొనసాగించాలని సూచించింది. ఉద్యోగుల ప్రయోజనాలు, సీనియారిటీ, ప్రమోషన్స్ ఇప్పటిలాగే ఉండాలని తెలిపింది. కమిటీ రిపోర్టు ఇప్పుడు సీఎం రేవంత్ పరిశీలనలో ఉంది.


