← Back to news

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితి పెంపు

By Vishnu· 1h ago
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితి పెంపు

ఉద్యోగుల భవిష్య నిధి - EPFOలో వేజ్ సీలింగ్‌ని కేంద్ర ప్రభుత్వం 15వేల నుంచి 25వేల రూపాయలకు పెంచింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పదేళ్లుగా ఈ పరిమితి 15వేలు గానే ఉంది. దీన్ని పెంచాలని ఎంప్లాయీ యూనియన్స్ చాలాకాలంగా కోరుతున్నాయి. కొత్త సీలింగ్‌తో మరింత మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ EPFO పరిధిలోకి వచ్చే చాన్స్ ఉంది. దీంతో ఎంప్లాయీస్‌కి PF, పెన్షన్ బెనెఫిట్స్ పెరగవచ్చు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై సుమారు 11 వేల 339 కోట్ల అదనపు భారం పడనుంది.

More in Current Affairs

ఏకలవ్య స్కూళ్లలో సమస్యలపై ఆభిజీత్ దీప్కే పిలుపు
Current Affairs· 2h ago

ఏకలవ్య స్కూళ్లలో సమస్యలపై ఆభిజీత్ దీప్కే పిలుపు

ఆదివాసీ పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని <a href="https://x.com/abhijeet_dipke/status/2100137240030494732">CJP ఫౌండర్ ఆభిజీత్ దీప్కే </a>కోరారు. ‘దేశంలో 720 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరైతే.. 477 మాత్రమే పనిచేస్తున్నాయి. 341 స్కూళ్లకే శాశ్వత భవనాలు ఉన్నాయి. 28 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో ST విద్యార్థుల GER 51.9 శాతం ఉండగా, నేషనల్ యావరేజ్ 58.4 శాతం. ఉన్నత విద్యలో ఇది 22.8 శాతానికి పడిపోతోంది' అని అన్నారు. వాలంటీర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కలిసి ఈ సమస్యపై గొంతెత్తాలి అని ఆయన పిలుపునిచ్చారు.