← Back to news

ఒక్క రోజులో ఊరంతా ఖాళీ

By Sahani· 9 Oct 2026· TG
ఒక్క రోజులో ఊరంతా ఖాళీ

పెద్దపల్లి జిల్లా కనుకుల గ్రామంలో నెల రోజుల్లోనే 16 మంది వరుసగా చనిపోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా సడన్‌గా చనిపోవడంతో ఊరికి పీడ పట్టిందని గ్రామస్థులు భయపడ్డారు. పండితుల సూచనతో నిన్న గురువారం తెల్లవారుజామున 5 గంటలకే పెంపుడు జంతువులతో సహా ఊరంతా ఖాళీ చేసి ఊరిబయిటకు వెళ్ళిపోయారు. రోజంతా అక్కడే వంటావార్పు చేసుకుని, సూర్యాస్తమయం అయ్యాక మళ్లీ ఇళ్లకు చేరుకున్నారు. ఈ వరుస మరణాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

More in TG