ఇవాళ్టి నుంచి బుక్స్ ఎగ్జిబిషన్.. 50% డిస్కౌంట్

TG: నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఇవాళ బుక్స్ ఎగ్జిబిషన్ ప్రారంభవుతోంది. అక్టోబర్ 3 వరకు రోజూ ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్, హిస్టరీ, కల్చర్, ఆర్ట్స్, జానపదం వంటి అంశాల బుక్స్ ఉంటాయి. తెలుగు వర్శిటీ ప్రచురించిన పుస్తకాలతో పాటూ.. ప్రముఖుల రీసెర్చ్, థియరీ గ్రంథాల పబ్లికేషన్లను కూడా ప్రదర్శనలో ఉంచుతున్నారు. బుక్స్‌పై 50 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.

