పాఠశాల వంటగదిలోనే మినీ అంగన్వాడీ

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడెం మినీ అంగన్వాడీ కేంద్రం పాఠశాల వంటగదిలోనే కొనసాగుతోంది. 17 మంది (పిల్లలు, గర్భిణులు) ఇరుకు గదిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో ఊపిరాడని దుస్థితి నెలకొంది. వంట చేయడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామని, వెంటనే తగిన వసతి కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


